LATEST UPDATES ...

Messege

Search box
Related Posts ...

2003 - DSC ద్వారా నియామకం పొందిన మనకోసం
, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఉపాద్యాయుల నియామకం కొరకు
మార్గదర్శకాలను GOMS No: 136,137 -
Dt:13-11-2003 ద్వారా 16449 పోస్టులకు
నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్షలను
2004 ఏప్రిల్ మాసం లో 4,5,6 తేదీలలో
నిర్వహించినారు. వీటి ఫలితాలను తేది
11-06-2004 న ప్రకటించడం జరిగింది.
నోటిఫికేషన్ విడుదల మరియు ఫలితాలను
ప్రకటించే నాటికీ రాష్ట్రం లో , రాష్ట్ర ప్రభుత్వం
ద్వారా నియమించబడే ఉద్యోగులకు
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (C.P.S) లేదు.
అట్టి నోటిఫికేషన్లో పేర్కొనబడిన అర్హతలు,
ఎంపిక విధానం, నియమ నిబంధనలలో ఎక్కడ కూడా
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఈ 2003 - DSC
నుంచే వర్తించును అని పేర్కొనబడలేదు.
అంతేకాకుండా మన మిత్రులు గమనించవలసిన
విషయం ఏమిటంటే, ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్
విధానం GOMS No:654, 655 ఫైనాన్స్, తేది
22-09-2004 ద్వార అమలులోకి వచ్చింది. అనగా
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (C.P.S)
అమలులోకి వచ్చిన తేది కంటే ముందుగానే మన
2003 - DSC నోటిఫికేషన్ విడుదల, రాత పరీక్ష
మరియు ఫలితాలను ప్రకటించడం కూడా
జరిగిపోయనవి. అయినా కూడా మనం
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం కిందనే
పరిగణించబడి అన్యాయానికి బలి అవుతూనే
ఉన్నాము.
మిత్రుల్లారా మన తెలంగాణా రాష్ట్రం లో మనం
కేవలం 6500 మంది ఉపాధ్యాయులం మాత్రమే
ఉన్నాము. ఉద్యోగుల క్షేమం కోరే మన
ప్రభుత్వానికి ఆర్థికంగా భారం పడే అవకాశం కూడా
లేదు. ఇన్నాళ్ళు మన ప్రయత్నాలను స్వరాష్ట్రం
సాధించే దిశలో ఉపయోగించాం. ఇప్పుడైనా మనకోసం
మనకు తోచిన విధంగా ప్రయత్నాలను ముమ్మరం
చేద్దామని విన్నపం ...

కృతజ్ఞతలతో,

2003 - DSC ఉపాధ్యాయులు..




Print / Save as PDF

0 Comments:

Post a Comment

Hey Say Something.....!!!

DSC/TET/CTET MATERIALS